ఒప్పో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ ఎంతో ముచ్చటపడి రెండు రోజుల క్రితం కొనుక్కున్నాడు ఆ యువకుడు. అయితే అది హఠాత్తుగా పేలి అతని ప్రాణాలను తీయబోయింది. స్మార్ట్ ఫోన్ ప్యాంట్ జేబులో ఉండబట్టి, తొడకు తీవ్రగాయాలతో అతను ప్రాణాలు దక్కించుకున్నాడుగానీ, అదే షర్ట్ జేబులో ఉండుంటే ప్రాణాలే పోయేవి.
ఈ ఘటన, అరటిపళ్ల వ్యాపారం చేసుకుంటున్న అల్వాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), తన బంధువుల అమ్మాయిని టెన్త్ పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి, తిరిగి తీసుకుని వస్తున్న సమయంలో ప్యాంట్ జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీనితో అతను బైక్ పైనుంచి పడిపోగా, తలకు కూడా గాయమైంది. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. ఒప్పో కంపెనీపై బొల్లారం పోలీసులకు ఇమ్రాన్ ఫిర్యాదు చేశాడు.