telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీకి షాక్‌.. కీలక నేత రాజీనామా

ycp ap

తెలంగాణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి తాను ఎందుకు రాజీనామా చేస్తూన్నాననే విషయంపై నిశితంగా మాట్లాడారు. 2007లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నాకు పరిచయం ఉందని.. అప్పుడు కాంగ్రెస్ లో చేరామని… నాటి నుంచి నేటి వరకు వైఎస్ జగన్ తో కలిసి నడిచానని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ పై ఉన్న నమ్మకంతో ఆయన వెంట ఉండిపోయామన్నారు. హుజుర్ నగర్ లో నన్ను స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడుగా జగన్ నియమించారని.. వైఎస్ జగన్ నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించారని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు నడుచుకున్నానని…. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారని తెలిపారు. అందుకే 151 ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీలు వైసీపీ గెలిచిందన్నారు. తెలంగాణలో పోరాటాలు చేయలేదనే ఆరోపణలు వచ్చాయని.. అందుకే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ పార్టీలో చేరాలనుకుంటున్నానని.. భవిష్యత్ లో జాతీయ పార్టీ నుంచే హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సాగర్ లో డబ్బే గెలుస్తుందని… డబ్బు కావాలా? అభివృద్ధి కావాలా ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.

Related posts