telugu navyamedia
రాజకీయ వార్తలు

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల దిగుమతి శుభపరిణామం: వెంకయ్యనాయుడు

venkaiah naidu

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వంతీసుకుంటున్న చర్యల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఏపీలో కరోనా నివారణ చర్యలు జరుగుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకోవడం శుభపరిణామం అని అభినందించారు.

కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించవచ్చని, ఇది మంచి నిర్ణయం అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని వెంకయ్య తెలిపారు.

Related posts