telugu navyamedia
news political Telangana

 అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాల విమర్శలు: మంత్రి తలసాని

talasani srinivasayadav on clp merger

రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అచ్చంపేటలో బుధవారం ఆయన యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు.

కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

ఢిల్లీ ఓటర్లకు.. వరాలజల్లు కురిపిస్తున్న బీజేపీ..

vimala p

సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

vimala p

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్…యూటీఎఫ్ అభ్యర్థి ఘనవిజయం

vimala p