telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఈశాన్య ఋతుపవనాలు : రాగల మూడు రోజుల్లో

ఈరోజు (అక్టోబరు 28వ తేదీన) తెలంగాణ రాష్ట్రం నుండి మరియు మొత్తం భారతదేశం నుండి నైఋతి రుతుపవనాలు ఉపసంహరించబడ్డాయి. అదే సమయంలో దిగువ ట్రోపొస్పీయర్ స్థాయిల వద్ద ఈశాన్య దిశ నుండి గాలులు మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో 1.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.కాగా.. మొన్నటివరకు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలు కోలుకుంటున్నాయి. 

Related posts