telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఉప ఎన్నిక : టీఆర్ఎస్ కు భారీ షాక్

TRS flag

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడింది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. ప్రస్తుతం బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్‌‌ పార్టీని వీడి తొగుట ఎంపీపీ కాంగ్రెస్ లోకి చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తొగుట ఎంపీపీ లత నరేందర్ రెడ్డితో పాటు మండలంలోని కీలక నేతలు చేరారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కొట్టే దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరగాలని అన్నారు. ఈ ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి టీఆర్‌ఎస్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొడదామన్నారు. మూడు రోజుల్లోగా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలని కోరారు.

Related posts