telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. పనిఒత్తిడి .. అనుకోని ఖర్చులు..

today rasi falalu

మేషం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృషభం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

సింహం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఆర్థిక విషయాలు అనుకూలించవు. వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

కన్య : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ పరాకు కారణంగా డబ్బు కానీ, విలువైన వస్తువులు కాని పోగొట్టుకునే అవకాశముంటుంది. మానసిక ఆందోళనకు లోనవకుండా జాగ్రత్తగా ఉండటం మం చిది. మీ సంతానం లేదా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయం లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కోరుకున్న మార్పు జరుగుతుంది.

తుల : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

వృశ్చికం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు : ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేతదర్శనం చేసుకుంటారు.

మకరం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

కుంభం : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కాని, అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. మీ మాట విషయంలో, ప్రవర్తన విషయంలో జాగ్రత్త అవసరం. తలబిరుసుగా ప్రవర్తించకండి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు, నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగేయండి.

మీనం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయటం వలన ఆ బాధ కొంత తగ్గుతుంది. ఉద్యోగంలో కోరుకున్న మార్పు జరుగుతుంది. మీ సహోద్యోగుల సహకారం అందుకుంటారు. వ్యాపారంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి.

Related posts