telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఇంటర్ తోనే .. జాబ్ అంటున్న .. హెచ్‌సీఎల్..

techbee and hcl training program to +2

టెక్ బీ-హెచ్‌సీఎల్ సంయుక్తంగా ఇంటర్మీడియట్, 10+2లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇంటర్ పూర్తిచేసినవారు చిన్న వయసులోనే ఉద్యోగాలలో స్థిరపడేలా నైపుణ్యాలపై శిక్షణ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులనుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు హెచ్‌సీఎల్ వైస్‌ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు.

ఎంపికైనవారికి తాము స్వయంగా నైపుణ్యాలపై ఏడాదిపాటు శిక్షణ ఇస్తామని, మొదటి నెల నుంచి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తామని, ఇక్కడ శిక్షణ పొందుతూ ఉన్నత విద్య చదువుకోవడానికి బిట్స్ పిలాని, శాస్త్ర యూనివర్సిటీ వంటివి అందుబాటులో ఉన్నాయని తెలిపారు దరఖాస్తు చేసుకోవడానికి https://www. hcitechbees.com/enroll-form/ లింకు ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Related posts