telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ … ఇక అన్నింటా మాజీనే..

pak cricket board released ahmed from all

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు వేసింది. టీ 20, టెస్ట్ టీమ్‌లకు కెప్టెన్ గా తనని తప్పించింది. మొన్న వన్డే ప్రపంచకప్‌ నుండి పేలవ ఫిట్‌నెస్ విషయంపై అనేక విమర్శలు ఎదుర్కొన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకుంది. అతడ్ని కేవలం కెప్టెన్సీ బాధ్యతలు నుంచే కాకుండా టీమ్‌ నుండి కూడా తప్పిస్తున్నటు వెల్లడించారు. శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో పాక్ జట్టుని సమర్థంగా నడిపించలేకపోయిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనూహ్య చర్యలు చేపట్టాయి. లాహోర్‌లో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 0-3తో పాక్ చేజార్చుకోవటంతో,కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్ విఫలమవడంతో ఆయనను,కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు పీసీబీ. టెస్టు బాధ్యతలను అజహర్ అలీకి,అలాగే టీ20 కెప్టెన్సీ బాధ్యతల్ని బాబర్ అజామ్‌కి అప్పగించారు . వన్డే జట్టు కెప్టెన్‌ ఎవ్వరు అన్నది ఇంకా పెండింగ్‌లో ఉంచిన్నటు తెలిపారు.

గడిచిన రెండేళ్లలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తు వచ్చారు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కూడా గెలిపించారు. కానీ,సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీ టైములో టెస్టులు, వన్డేల్లో పాకిస్తాన్ ర్యాంక్ రానురాను పడిపోయింది. తాజాగా ఈ మధ్య సొంత గడ్డ మీద శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ వైట్ వాష్ అయింది. పాకిస్థాన్ జట్టు నవంబరులో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. దీనికోసం జట్టు ఎంపికపై పూర్తి జాగ్రత్త వహిస్తున్నట్టు పీసీబీ చెప్పారు. దానికి మొదట అడుగుగానే కెప్టెన్సీలో ఈ మార్పులు చేశారు అని చెప్పారు. సర్ఫరాజ్‌ అహ్మద్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగించటమే కాకుండా, జట్టులో కూడా చోటివ్వబోమని పీసీబీ స్పష్టం చేసింది. క్రికెట్‌లో మళ్లీ ఆడి ఫామ్ లోకి వచ్చి, నిరూపించుకోవాలని సర్ఫరాజ్‌కి సూచించారు పీసీబీ. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆడనున్న జట్టుని పీసీబీ సోమవారం ప్రకటించనుంది.

Related posts