telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ సాంకేతిక

చంద్రయాన్-2 పనులు చకచకా.. చేస్తున్న ఇస్రో..

isro on chandrayan-2

చంద్రయాన్-2 తో ఇస్రో(భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ) గగనతలంలో మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్‌.. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-1 వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను సైతం విజయంతం చేసిన ఆత్మవిశ్వాసంతో.. చంద్రయాన్‌-2 ప్రయోగానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగవేదికకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ను తరలించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ -2ను ప్రయోగించనున్నారు. వారం రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహించనున్న ఇస్త్రో శాస్త్రవేత్తలు… ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌-2ను నింగిలోకి పంపనున్నారు.

Related posts