telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లవకుశ”లో లవుడు పాత్రధారి నాగరాజు కన్నుమూత

Nagaraju

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు “లవకుశ” సినిమాలో లవుడుగా నటించిన నాగరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు నాగరాజు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా “లవకుశ” సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం అద్భుతంగా నటించారు.

Related posts