నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి “రూలర్” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి ట్రైలర్స్, సాంగ్స్ విడుదల చేశారు. ఇవి ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. అయితే నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు టాక్ ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా రొటీన్ బాలకృష్ణ సినిమాలా ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుందట. యాక్షన్, పంచ్ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రూలర్ బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు బాలయ్య లుక్ విషయంలో కూడా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఇదంతా సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
previous post