telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్యం దుకాణాలు తెరవడంపై చంద్రబాబు విమర్శలు

chandrababu

ఏపీలో నిన్న మద్యం దుకాణాలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలు తెరవలేదని అన్నారు.

రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని, ఈ బ్రాండ్లను వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు. నలభై రోజులుగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపలేదని తెలిపారు. మద్యపాన నిషేధానికి ఇంతకంటే మంచి సమయం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts