telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల … ప్రయోగం విజయవంతం…

brahmos weapon trail success by indian navy

అండమాన్ నికోబార్ దీవుల్లో భారత వాయుసేన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భారత వైమానిక దళం(ఐఎఎఫ్) సాథారణ కార్యాచరణలో భాగంగా ఈ నెల 21 నుంచి 22 తేదీల్లో రెండు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రయోగించింది. బ్రహ్మోస్ క్షిపణులు నేరుగా 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకాయి. ఈ క్షిపణుల ప్రయోగంతో భారత వాయుసేన దళం సామర్థ్యం పెరిగింది.

ఈ బ్రహ్మోస్ క్షిపణులు పగలు, రాత్రీ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శత్రువులపైకి ప్రయోగించవచ్చు. సుఖోయ్ విమానాలతోపాటు బ్రహ్మోస్ క్షిపణులు మన వాయుసేన సామర్థ్యాన్ని పెంచాయి. రష్యాతోపాటు భారతదేశం కలిసి అభివృద్ధి చేసిన 8.8 మీటర్ల పొడవైన బ్రహ్మోస్ క్షిపణులు 200 నుంచి 300 కిలోల వార్ హెడ్ ను మోయగలవు. ఈ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలవు.

Related posts