telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

రొటేటింగ్ కెమెరాతో .. శాంసంగ్ గెలాక్సీ సరికొత్త మొబైల్..

samsung gelaxy a80 with rotating cam

శామ్సంగ్ సంస్థ మరో సరికొత్త మొబైల్ తో మార్కెట్ లోకి రానుంది. ఈ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ ముందుకు మరియు వేనుకకు కూడా తిప్పగలిగే సదుపాయం ఉన్న ట్రిపుల్ కెమేరా సేటప్పుతో ఉంటుంది. శామ్సంగ్, దీన్ని నిన్నఇండియాలో రూ.47,990 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 730G ఆక్టా కోర్ ప్రొసెసరుతో ఉంటుంది. ఆగష్టు 1 వ తేదీన అంటే రేపు దీని మొదటి సేల్ జరగనుంది. శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ 20: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎటువంటి నోచ్ లేకుండా ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు దాదాపుగా అంచులు లేకుండా, FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080×2400 p రిజల్యూషను మరియు వీనుల విందైన VIVID మరియు బ్రిట్నెస్ అందిస్తుంది. ఇది తాజాగా క్వాల్కమ్ ప్రకటించినటువంటి, క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 730G SoC తో నడుస్తుంది.

ఈ మోడల్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. అయితే, ఇందులో స్టోరేజిని పెంచుకునేలా ఎటువంటి ఎంపికను అందించలేదు. అలాగే, ఇది ఒక 3,700mAh బ్యాటరీ మరియు 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన 48MP కెమెరా f / 2.0 ఎపర్చరు జతగా 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల ఒక వైడ్ యాంగిల్ 8MP కెమేరా మరియు ఒక ToF కెమేరాని కలగలిపిన ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక్కడ ఆశర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ కెమేరాని ముందు భాగంలో సెల్ఫీగా మరియు వెనుక కెమెరాలగా కూడా వాడుకునేలా రోటేటింగ్ ఎంపికతో అందించింది. అంతేకాదు దిన్ని ఒక SonyIMX586 సెన్సారుతో అందించింది. ఇక ఈ 48MP కెమేరా విషయానికి వస్తే, ఇది డిఫాల్ట్ గా రెడ్మి నోట్ 7 ప్రో మాదిరిగా బిన్నింగ్ పద్దతిలో 12MP రిజల్యూషన్ ఫోటోలను అందిస్తుంది. అయితే, ఈ ఫోనులో అందించిన ఒక ప్రో మోడ్ ద్వారా చాలా వేగంగా 48MP రిజల్యూషన్ ఫోటోలకు మారవచ్చు.

Related posts