telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బేర్ గ్రిల్స్ తో రజినీకాంత్ అడ్వెంచర్… మోషన్ పోస్టర్ విడుదల

Rajinikanth

డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, బ్రిటన్ కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మ‌ధ్య ప్ర‌ధాని మోదీతో సాహ‌స యాత్ర చేసిన బేర్ గ్రిల్స్ రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మైసూర్‌ ప్రాంతంలో ఉన్న బండీపూర్ అభ‌యార‌ణ్యంలో రిస్కీ స్టంట్స్ చేశాడు. అయితే ఈ సాహ‌స‌యాత్రలో ర‌జ‌నీకాంత్‌కి స్వ‌ల్వ గాయాలు కూడా అయ్యాయి. తాజాగా ర‌జ‌నీతో క‌లిసి బేర్ గ్రిల్స్ చేసిన అడ్వెంచ‌ర్‌కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌యింది. ఇందులో త‌లైవా, బేర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఫుల్ ఎపిసోడ్ ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే మోదీతో చేసిన అడ్వెంచర్ కి ఉత్తరాఖండ్‌లోని జాతీయ పార్కును ఎంచుకున్న బేర్‌ గ్రిల్స్ ర‌జ‌నీతో మాత్రం బండీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ జోన్‌ను సెలక్ట్ చేసుకోవ‌డం విశేషం.

Related posts