ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా సౌతంప్టన్ వేదికగా నేడు టీమిండియా, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ కు టీమిండియా సర్వసన్నద్ధమైంది. ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఎలాగైనా ఈ సారి కప్ నెగ్గేందుకు టీమిండియా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించడం ద్వారా బోణీ కొట్టాలని ఊవిళ్లూరుతున్న కోహ్లీ సేన, ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ ఫిట్ గా కనిపిస్తోంది.
ముఖ్యంగా సఫారీలను కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలని సిద్ధపడుతోంది. అయితే సౌతాఫ్రికాకు చెందిన కీలక ఆటగాళ్లైన డేల్ స్టెయిన్, ఎన్ గిడి గాయాల కారణంగా ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే. అలాగే బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పొందడం కూడా సౌతాఫ్రికాను మానసికంగా కుంగదీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సౌతాఫ్రికా ఆడిన రెండు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్టు 300కు పైగా పరుగులు సాధించింది. భారత్ లక్ష్యం 228 పరుగులు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ప్రపంచ కప్ మొదటి అడుగు విజయవంతంగా వేసినట్టు ఉంటుందని అభిమానులు ఆశపడుతున్నారు.
తెలుగు వాళ్లకి పక్కింటి పుల్ల కూరే ఇష్టం… నటి కవిత షాకింగ్ కామెంట్స్