telugu navyamedia
culture news Telangana

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు

bathukamma celebrations in sidney

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు మొదలైన జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ పాటలు మార్మోగుతున్నాయి. కొమ్ము, కోయ, గుస్సా నృత్యాలతో కళాకారులు ఆకట్టుకుంటున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో వందలాది బతుకమ్మలను మహిళలు పేర్చారు. ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలకు సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

Related posts

సీఎం మాస్కు పెట్టుకోకపోవడం క్షమించరాని నేరం: చంద్రబాబు

vimala p

పవన్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

vimala p

హైదరాబాద్-కూకట్ పల్లి-భాగ్యనగర్ లో.. వ్యభిచారం..

vimala p