వచ్చే వారమే బీజేపీలో చేరుతానని ఈటల పేర్కొన్నారు. నేను వామపక్ష, లౌకిక వాదిని… కానీ పరిస్థితులు తనను బిజేపి వైపునకు తీసుకెళ్ళాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ? రాష్ట్రంలో సీపీఐ పార్టీ పోటీలో ఉండాలా లేదా అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ? అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు టిఆర్ఎస్ ప్రయతించిందని… ఇప్పటికే హుజురాబాద్ నియోజవర్గంలో టిఆర్ఎస్ 50 కోట్లు ఖర్చు పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడానని.. బిజెపి అగ్రనేతల సమావేశంలో టిఆర్ఎస్ తో సంబంధాల గురించే మొదటగా అడిగా ? అని పేర్కొన్నారు. హరీష్ రావు నా కంటె ఎక్కువగా అవమానాలకు గురి అయ్యారని వెల్లడించారు ఈటల.
previous post