telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మెలో ఉన్నవారి ఉద్యోగాలు పోయినట్టే..అద్దె బస్సులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. : కేసీఆర్

kcr stand on earlier warning to rtc employees

ఒకపక్క సమ్మె జరుగుతుంటే, ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ .. ప్రస్తుతం చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగడం సరైంది కాదన్నారు. పండుగల సీజన్లో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీపడే సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పు చేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి..బ్లాక్ మెయిల్ విధానం శాశ్వతంగా ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పారు.

ముందస్తు హెచ్చరికల ప్రకారం సమ్మెలో పాల్గొన్న ఉద్యోగాలు పోయినట్టే అని, తక్షణం 2,500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

Related posts