తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదంపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి.. న్యాయవాదుల వాదనలు విన్నారు. సమ్మె చట్టబద్ధంకాదని ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదించారు.
ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని… సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులను ఈనెల 10న తమకు నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.