telugu navyamedia
సినిమా వార్తలు

అభిమాని తీరుతో అసంతృప్తికి గురైన లారెన్స్

Raghava-Lawrence

రాఘవ లారెన్స్ నటించిన “కాంచన-3” సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సినిమా థియేటర్ల వద్ద లారెన్స్ భారీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఆయన్ని దైవంగా భావించే కొందరు అభిమానులు ఆ కటౌట్ కి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని క్రేన్ కొక్కీకి వేలాడుతూ కటౌట్ కి అభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన లారెన్స్ షాక్ అయ్యారు. అభిమాని క్రేన్ కి వేలాడుతూ పాలాభిషేకం చేస్తున్న వీడియో చూసి చాలా బాధపడినట్లు చెప్పారు. ఇలాంటి రిస్క్ లను తీసుకోవద్దని, ప్రాణాలని రిస్క్ లో పెట్టి, తనపై ప్రేమను ఇలా చూపడం కరెక్ట్ కాదని, ఇంట్లో వాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని కోరారు. నిజంగా తనపై ప్రేమను నిరూపించుకోవాలంటే.. పేద పిల్లలకు పుస్తకాలు, ఆహరం లేకుండా ఇబ్బంది పడుతున్న వృద్ధులకు సహాయం చేయాలని కోరారు. అటువంటి పనులు తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు గర్వపడేలా చేస్తాయని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రాఘవ లారెన్స్.

Related posts