telugu navyamedia
సినిమా వార్తలు

మంచు విష్ణు చేతుల మీదుగా నీకు నాకు పెళ్ళంట ట్రైలర్ విడుదల ..

శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం నీకు నాకు పెళ్ళంట. కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటుడు మంచు విష్ణు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ…కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.

ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

Related posts