telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుపై .. బీహార్ కోర్టు లో పిటిషన్.. 28న విచారణ .. !

ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా చేసిన ప్రసంగాలు ఆయా పార్టీ నేతలకు కేసుల రూపంలో చుట్టుకుంటున్నాయి. నిన్న పవన్ పై తెలంగాణాలో కేసు నమోదు కాగా, నేడు ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు బీహార్, ముజఫర్ పూర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు వెల్లడించింది. ఇటీవల ఓ ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, బీహారీలను అవమానించేలా ‘బీహారీ డెకాయిట్’ అన్న పదాన్ని ఆయన వాడారని ఓ లాయర్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

దీన్ని విచారణకు తీసుకుంటున్నామని చెప్పిన న్యాయమూర్తి, కేసు విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఒంగోలులో జరిగిన సభలో ప్రశాంత్ కిశోర్ ను బీహారీ డెకాయిట్ గా అభివర్ణించిన చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరపూరిత సలహాలను ఇస్తున్న ఆయన, ఏపీలోని లక్షలాది ఓట్లను తెలగించాలని కుట్రలు పన్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత కిశోర్ జేడీఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీకి రాజకీ సలహాదారుగానూ వ్యవహరిస్తున్నారు.

Related posts