telugu navyamedia
సినిమా వార్తలు

మమతాబెనర్జీ బయోపిక్ ట్రైలర్ తొలగింపు

Baghini

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వలన పలు బయోపిక్ లకు ఈసీ బ్రేకులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ కు ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బయోపిక్ “బాఘీనీ” చిత్రంపై ఎన్నికల కమిషన్ దృష్టిని సారించింది. మమతాబెనర్జీ బయోపిక్ కు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సర్టిఫికెట్ మంజూరు చేయనందు వల్ల ఈ బయోపిక్ ట్రైలరును కూడా వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ వచ్చాక ఈ మమత బయోపిక్ ను విడుదల చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని ఈసీ ప్రకటించింది. రాజకీయ పార్టీలకు చెందిన, నేతలకు చెందిన ఎలాంటి బయోపిక్ లైనా ఎన్నికల నియమావళి ప్రకారం నిషేధిస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే తన జీవితాన్ని బయోపిక్ గా తీశారంటూ వ్యాపించిన పుకార్లపై తాను పరువునష్టం దావా వేస్తానని మమతాబెనర్జీ హెచ్చరించారు. కొంతమంది యువకులు సేకరించిన కథలను సినిమాగా తీశారని, ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Related posts