telugu navyamedia
సినిమా వార్తలు

“మా ” ఎన్నికల్లో బెట్టింగ్ బంగార్రాజులు

2021 “మా ” ఎన్నికలు 10వ తేదీ జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా తెలుగు సినిమా రంగాన్ని రెండుగా చీల్చాయి . ఎవరికీ వారే తమ ప్రతిష్ఠ కోసం లక్షల రూపాయలను ఖర్చుపెడుతున్నారు . “మా ” లో వున్నది 950 మంది మాత్రమే సభ్యులు . వీరిలో వచ్చి ఓటేసేది 500 మంది ఉంటారేమో . ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు రెండు ప్యానల్ సభ్యులు గత 10 రోజులుగా తమ మేనిఫెస్టోలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసున్నారు.

ఒకరి అర్హత గురించి మరొకరు ప్రశ్నిస్తున్నారు , ఆరోపణలు చేసికుంటున్నారు , మాటల బాణాలతో యుద్ధ వాతావరణం సృష్టించారు .
ఎప్పుడు లేనంతగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. వీరి ఉత్సాహాన్ని గమనించి మీడియా కూడా అగ్నికి ఆజ్యంలా తోడై “మా ” మంటను మరింత పెంచింది . ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇస్తున్నారు , చిరంజీవి తరుపున ఆయన సోదరుడు ప్రకాష్ రాజ్ గెలుపు కోసం కృషి చేసున్నారు.

మంచు విష్ణు కోసం మోహన్ బాబు గత పది రోజులనుంచి “మా ” సభ్యులకు స్వయంగా ఫోన్ చేస్తున్నారు . ఈసారి “మా ” ఎన్నికలు ప్రపంచంలో వున్న తెలుగువారి దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాయి . అందుకే బెట్టింగ్ బంగార్రాజులు కూడా రంగంలోకి దిగిపోయారు . ప్రకాష్ రాజ్ గెలుస్తాడని కొందరు . మంచు విష్ణు నెగ్గుతాడై మరి కొందరూ లక్షల రూపాయలతో పందేలు కాస్తున్నారు . ఇప్పుడు ఫిలిం నగర్ అంత హాట్ హాట్ గా మారిపోయింది . ఈ ఇద్దరిలో ఎవరో గెలుస్తారు ? ఎవరు పరాజయం పాలవుతారు ” ఆదివారం సాయంత్రం టీవీ తెర మీద చూడండి

Related posts