telugu navyamedia
telugu cinema news

ఆసక్తి రేకెత్తిస్తున్న “లిసా” టీజర్

Lisaa

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ అంజలి. ప్రస్తుతం అంజలి నాయికా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎక్కువగా పోషిస్తోంది. తాజాగా అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హార్రర్ థ్రిల్లర్ “లిసా”. ఈ త్రీడి చిత్రం నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు దెయ్యాలు లేవని నిరూపించే ప్రయత్నం చేసిన అంజలికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది చిత్ర కథాంశం. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం, కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇదివరకే అంజలి హార్రర్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

మ‌హాన‌టి ఫేమ్ బాల‌న‌టి సాయి తేజ‌స్విని ప్ర‌ధాన ప్రాత‌లో ప్రియ‌మ‌ణి “సిరివెన్నెల”‌

ashok

అల వైకుంఠపురంలో : “సామజవరగమన”… యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్

vimala p

హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాతగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం `RDX`

ashok