telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న సమంత..

అక్కినేని సమంత తన హస్బెండ్ నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ కు ప్రముఖ పర్యాటక కేంద్రం మాల్దీవులు వెళ్ళింది. అక్కినేని నాగచైతన్య సైతం అక్కడే ఉన్నారని సమాచారం. ప్రస్తుతం సెలెబ్రిటీలకు వెకేషన్ అంటే ఒక్కటే స్పాట్ మాల్దీవులు.. వరుసబెట్టి మన తారలందరూ అక్కడికే వెళ్తున్నారు. తాప్సీ తన సోదరి, ఫ్రెండ్‌తో కలిసి మాల్దీవుల్లోనే ఎంజాయ్ చేసింది. మరో వైపు కాజల్ తన హనీమూన్‌ను సైతం అక్కడే ప్లాన్ చేసుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ చేసే హంగామా వైరల్ అవుతోంది. బీచ్‌లో బికినీలు, సముద్రపు ఒడ్డున యోగాసానాలు, ఫ్యామిలీతో కలిసి డిన్నర్లు అంటూ మాల్దీవుల్లో రకుల్ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ రోజు నాగచైతన్య జన్మదినోత్సవం… ఈ నేపథ్యంలో బర్త్ డే వెకేషన్ కోసం వీరిద్దరూ మాల్దీవులకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సమంత అభిమానులతో పంచుకుంటోంది. ‘మొత్తానికి సాధించా.. సముద్రంలో డైవ్ చేశా..’ అంటూ కామెంట్ చేసింది.

Related posts