telugu navyamedia
సినిమా వార్తలు

బంజారాహిల్స్ లో రాడిసన్ పబ్‌లో నీహారిక లేట్ నైట్ పార్టీ..నాగబాబు క్లారిటీ

హైదరాబాద్ హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వ‌హించి ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే పబ్‌లో పాల్గొన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్‌లో పాల్గొన్నారు. వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. 142 మంది అడ్రస్‌లు, ఇంటి నెంబర్‌లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ దాడుల్లో ప‌ట్టుబ‌డ్డ వారిలో పలువురు సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది . పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు ..ఆ సమయంలో పబ్‌లో నిహారిక ఉండడం తాను రెస్పాండ్ అవుతున్నట్లు వెల్లడించారు. అయితే నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పబ్‌ను సమయానికి మించి నడపడం వల్లే పోలీసులు యాక్షన్ తీసుకున్నారని.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని తనకు పోలీసులు సమాచారం ఇచ్చారని నాగబాబు తెలిపారు.

నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దని.. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎలాంటి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్ గా ఉంది. దయచేసి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్” అంటూ వీడియోలో మాట్లాడారు.

Related posts