telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య బాలకృష్ణ NBK107 మూవీ లాంచ్..

నందమూరి బాలకృష్ణ నటించనున్న కొత్త సినిమా షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణ కెరీర్‏లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం NBK107 అనే వర్కింగ్ టైటిల్‏తో నిర్మిస్తున్నారు. పక్కా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం.

బాల‌కృష్ణ‌కు జ‌త‌గా శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటించనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది.

Image

ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు టాలీవుడ్‌ దర్శకులు హాజరై అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, వి.వి.వినాయక్‌, బుచ్చిబాబు, బాబీతోపాటు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, శ్రుతిహాసన్ హాజరయ్యారు ఈ వేడుకలో పాల్గొన్నారు.

balayya

వి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ హరీష్ శంకర్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.

Image

కాగా.. బాల‌కృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెరకెక్కిన ‘అఖండ మూవీ ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేశారు. పూర్ణ కీలకపాత్ర పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.

Related posts