telugu navyamedia
సినిమా వార్తలు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నిజాలు ఉన్నాయి..అందుకే చంద్రబాబుకు భయం

Lakshmi parvathi comments chandrababu
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో నిజాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాను తిరస్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై లక్ష్మీపార్వతి ఘాటుగా స్పందించారు. ఆ సినిమాలో నిజాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని ఆమె అన్నారు. తాను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ధైర్యంగా, నిజాయితీగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ద్వారా అసలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని అన్నారు. 
బాలకృష్ణ తీసిన సినిమాల్లో వాస్తవం లేదు కాబట్టే ప్రజలు ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందన్నారు. వాటీజ్‌ దిస్‌ అనేది…ఈ సినిమాతోనే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. వర్మకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో అకారణంగా తనపై నిందలు వేసి, అవాస్తవాలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ మరణం, ఆనాటి పరిణామాలపై విచారణ కమిటీ వేయాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.

Related posts