telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఆమేనా…?

Kiara

డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీకి… అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అవుతున్నారు. ఈ కథ నచ్చి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఈ సినిమాకు “లైగర్” అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. పూరి సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌తో విజయ్‌ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా భారత్, పాకీస్తాన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని సైనికుడిగా కనిపించనున్నాడని టాక్ వస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే తనకు విజయ్ అంటే చాలా ఇష్టం అని కియారా చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా విజయ్ స్నేహితుడు కేదర్ సెలగంశెట్టి టాలీవుడ్‌లోకి నిర్మాతగా అరంగేట్రం చేయనున్నాడు. అతడి బ్యానర్ ఫాల్కన్ క్రియేషన్స్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Related posts