telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ పై కేరళ సీఎం ప్రశంసలు

Aa

కరోనా మహమ్మారి కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యంగా రోజువారి కూలీ పనులు చేసుకునే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖులు తమ స్తోమతకు తగ్గట్లుగా ఎంతో కొంత సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అల్లు అర్జున్ కూడా ఆ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా 25 లక్షల్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తమ రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు చేయూతనిచ్చిన అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించింది కేరళ సర్కార్. తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ సీఎం పినరయి విజయన్. ప్రభుత్వం లాక్ డౌన్ అంటూ ప్రకటించగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ఇవ్వగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. తమకు అందిన సాయాన్ని ధృవీకరించిన కేరళ సర్కార్.. బన్నీ చేసిన సాయాన్ని కేరళ ప్రజలు మరిచిపోరని ఈ ఆపత్కాలంలో మద్దతుగా నిలిచినందుకు రుణపడివుంటారని తెలిపారు కేరళ సీఎం పినరయి విజయన్.

Related posts