telugu navyamedia
news telugu cinema news

అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ మద్దతు కోరుతా అంటున్న కమల్‌హాసన్‌

Kamal

ఈమధ్య అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళ‌నలపై మ‌క్క‌ల్ నీధి మయ్యం అధ్య‌క్షుడు, నటుడు క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతులు డిమాండ్ల‌ను వినాలని కమల్ హాసన్ సూచించారు. వారి డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు కమల్ హాసన్ మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మద్దతు కోరతానని మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ తెలిపారు. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నానన్న కమల్‌.. తన మిత్రుడు రజనీకాంత్‌ ఇంటిని వదిలేస్తానా..? అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ సంతోష్ బాబు మ‌క్క‌ల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన్ను కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీలోకి ఆహ్వానించారు. మరి రజిని కమల్ కు మద్దతు పలుకుతాడా… లేదా అనేది చూడాలి.

Related posts

మధ్యాహ్నం రెండు గంటల తరువాత భారత్ కు అభినందన్‌!

vimala p

అమరావతి జేఏసీ ఆఫీసుకు పోలీసుల తాళాలు

vimala p

డాక్యుమెంటరీలో నటించటం మరిచిపోలేని అనుభూతి : రజినీకాంత్

vimala p