తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మూడు రోజుల్లో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, శ్రీరామ్ చంద్ర, మానస్, సిరి,షణ్ముక్ ఉండగా వీరిలో విన్నర్ అవుతారు అని అందరిలో ఆసక్తి నెలకొంది.
మరోవైపు వారిని గెలిపించేందుకు సెలబ్రిటీలు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచి తెలుగోడి సత్తా చాటిన సింగర్ శ్రీరామ్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కావాలని పలువురు సెలబ్రిటీలు తెలిపారు.
సోనూసూద్, శంకర్ మహదేవన్, ఎండీ సజ్జనార్, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రిటీలు శ్రీరామ్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
హాయ్ శ్రీరామ్. బిగ్‌బాస్ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావ్.
ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావ్. ఆల్ ది బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చారు. శ్రీరామ్ చంద్ర సోషల్ మీడియా పేజ్‌లో వీడియో పోస్ట్ చేయగా, ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.