telugu navyamedia
andhra political

జ‌నసేన తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖ‌రారు!

Janasena pawan comments Jagan
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు ప్రారంభించారు. అధికార పార్టీ ఇప్పటికే  ఎంపిక ప్రారంభించింది. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ త‌న పాదయాత్రలో  కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థులను ఖ‌రారు చేసారు. ఇక తొలిసారిగా  ఎన్నిక‌ల బ‌రిలో కి దిగుతున్న జ‌న‌సేన అభ్యర్థుల తొలి  జాబితా విడుదలకు ముహూర్తం ఖ‌రారు చేసింది. అందులో భాగంగానే ఈ నెల 26న రిప‌బ్లిక్ డే రోజున త‌మ పార్టీ తొలి జాబితా విడుద‌ల చేసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాన్ ముహూర్తంగా నిర్ణయించారు.
దీంతో జ‌న‌సేన నుండి పోటీ చేయాల‌నుకుంటున్న ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.  తొలుత క‌మిటీల‌ను ప్రకటించి, వీలైనంత త్వరగా అభ్యర్తులను ప్రకటించాలని  ప‌వ‌న్ భావిస్తున్నారు.  ఇప్పటికే పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల కమీటీలకు సంబంధించిన నివేదిక‌లు జనసేన అధినేత  ప‌వ‌న్ క‌ళ్యాన్ కు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఎమ్మెల్యేలుగా ప‌ని చేసిన వారు జ‌న‌సేన‌లో చేర‌టంతో వారికి  తొలి జాబితాలోనే పేర్లను  ఖ‌రారు చేస్తార‌ని తెలుస్తోంది. 

Related posts

తెరపైకి .. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ .. 8 మందికి ఉద్వాసన తప్పదా.. !

vimala p

తెలంగాణాలో.. రేపు ఆటో-క్యాబ్ లు .. బంద్..

vimala p

టీఆర్‌ఎస్ పై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p