telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. బతుకమ్మ చీరల పంపిణీకి .. తేదీలు ఖరారు..

batukamma sarees distribution from 23rd

ఈనెల 23వ తేదీ నుంచి బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు అందించే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఐటి, మున్సిౄపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ప్రతి నియోజక వర్గంలో చీరల పంపిణీని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్‌లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని వెల్లడించారు. మాసాబ్‌టాంక్‌లోని సీడీఎంఎ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌; చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజా రామఅయ్యర్‌, సీఈఎంఎ డైరెక్టర్‌ శ్రీదేవి, టిస్కోజీఎం యాదగిరి తదితరులతో కలిసి కేటీఆర్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ద్విముఖ వ్యూహంతో బతుకమ్మ చీరల పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ చీరలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 1.02 కోట్ల మంది అర్హులుగా తేల్చినట్టు చెప్పారు.

బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 313 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో మహిళలు ఎంతో భక్తితో జరుపుకునే బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు సంవత్సరాలుగా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. బతుకమ్మచీరల తయారీ ద్వారా 16వేల కుటుంబాలకు ఉపాధి భించిందన్నారు. 26వేల మర మగ్గాల ద్వారా చీరలను తయారు చేశామన్నారు. ఈ సంవత్సరం 10రకాల డిజైన్‌లు , 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరలను సిద్ధం చేశామని వివరించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలను సరఫరా చేశామని తెలిపారు. చేనేత కార్మికులకు గతంలో నెలకు 8 నుంచి 12వేలలోపే దక్కేవని, కానీ బతుకమ్మ చీరల తయారీ ప్రారంభించాక 16 వేల నుంచి 20వేల రూపాయల వరకు లభిస్తున్నాయని తెలిపారు. బతుకమ్మ చీరల కోసం మూడు సంవత్సరాల్లో 715 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Related posts