telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సైరా’పతి.. లుక్ అదుర్స్.. జన్మదిన శుభాకాంక్షలతో..

jabapatibabu first look in sairaa movie

సైరా వంటి భారీ చిత్రంతో మరోసారి తెలుగు సినీపరిశ్రమ బాక్స్ ఆఫీస్ వద్ద తన ఖ్యాతిని పరీక్షించుకోబోతుంది. ఈ భారీ చిత్రంలో నటీనటులు ఏరికోరి మరి ఎంచుకుంటున్నారు. అగ్రనేతలు అందరు ఒక తెరపై కనిపిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా – నరసింహారెడ్డి’లో విలక్షణ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో జగపతిబాబు పాత్ర ఎలా ఉండబోతుందో టీజర్ విడుదల చేశారు.

నేడు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్ ను యూనిట్ విడుదల చేసింది. ‘సైరా’లో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. ఇందులో జగపతిబాబు రెడ్డి రాజుగా నటిస్తున్నట్టు తెలుస్తుండగా, గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో జగపతిబాబు ‘అదుర్స్’ అనేలా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Related posts