telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేవేగౌడ కుటుంబ ఆలయంపై ఐటీ దాడులు

IT rides devagouda family members

లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో క ర్ణాటకలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో ఐటీ దాడులు జరిగాయి. ఈ ఆలయం దేవేగౌడ స్వగ్రామమైన హరదనహళ్లిలో ఉంది. ఐటీ దాడులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడులపై ఆలయ పూజారి భార్య మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఐటీ అధికారులు వచ్చి ఆలయం పక్కన ఉన్న తమ ఇంట్లో తనఖీలు నిర్వహించారని చెప్పారు.

చివరకు అత్యంత పవిత్రమైన గర్భగుడిలోకి ప్రవేశించేందుకు కూడా యత్నించారని, ఈ క్రమంలో వారిని తాము అడ్డుకున్నామని తెలిపారు. అనంతరం ఆలయంలో సోదాలు నిర్వహించి ఖాళీ చేతులతో వెనుదిరిగారని చెప్పారు. తనిఖీల సందర్భంగా దేవేగౌడ కుటుంబానికి చెందిన సొమ్మును ఇక్కడ ఉంచారా? అని అధికారులు తమను ప్రశ్నించారని ఆమె తెలిపారు.

Related posts