telugu navyamedia
సామాజిక

రంగంలోకి దిగిన‌ ఆర్మీ : బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డ బాబు

కేరళలో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత ఆర్మీ విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల పాటు తిండీ.. నీళ్లు లేకుండా అర‌చేతిలో ప్రాణాలు ప‌ట్టుకుని బాబు ప్రమాదం నుంచి సుర‌క్షితంగా బయటపడ్డాడు.

మలమ్‌పుజాలో ఉండే బాబు ఆర్.బాబు (23) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈనెల 7న అంటే సోమవారం కురుంబాచి అనే కొండపైకి ట్రెక్కింగ్‌కి వెళ్లాడు. పైకి వెళ్లే కొద్దీ బాగా అలసిపోయి బాబు స్నేహితులు మధ్యలోనే ఆగిపోయారు. కానీ బాబు మాత్రం ఆగకుండా కొండపై భాగానికి చేరుకున్నాడు. తిరిగి వచ్చే క్రమంలో 4వందల అడుగుల మేర జారిపడి.. కొండవాలుల్లో చిక్కుకున్నాడు.

Thumbnail image

కొండపై నుంచి చూసిన స్నేహితులు చనిపోయాడని అనుకునేంతలో వాళ్ల ఫోన్‌కి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను కొండ వాలుల్లో చిక్కుకున్నాను.. బతికే ఉన్నాను అని. వాట్సాప్‌లో లొకేషన్ కూడా పంపాడు. ఒక్కసారిగా తేరుకున్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు గానీ.. ఎక్కడా సాధ్యం కాలేదు. వెంటనే మలమ్‌పుజాకు చేరుకుని అధికారులకు చెప్పారు. రెవిన్యూ టీమ్స్‌ వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకున్నారు.

Army Rescued Kerala youth

అందరిలోనూ ఇక బాబును కాపాడడం అసాధ్యం అనే మాటలే వినిపించాయి. కేరళ సీఎం పినరయి విజయన్ సైన్యం సాయం కోరగా.. రెండు ఆర్మీ బృందాలు ఇవాళ తెల్లవారుజామున రంగంలోకి దిగి బాబును సురక్షితంగా కాపాడాయి.

మంగళవారం సాయంత్రం నుంచి అధికారులు ప్రయత్నించగా.. విల్లింగ్టన్ ఎయిర్‌బేస్ అధికారులు, మౌంటేనీరింగ్ టీమ్‌.. ఈ ఉదయం హెలికాప్టర్లతో అక్కడికి చేరుకున్నాయి. విజ‌య‌వంతంగా బాబు ర‌క్షించారు.

తనను ప్రాణాలతో రక్షించిన భారత ఆర్మీకి యువకుడు బాబు ధన్యావాదాలు తెలిపాడు. సంతోషంలో అంద‌రికి ముద్దులు వ‌ర్షం కురింపించారు. ప్ర‌స్తుతం ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts