telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మోదీ చర్యలపై డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు

who modi

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోదీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై భారత్‌ను ఉదహరించింది.

సామాజిక సంక్షేమం కోసం, ఆహారంతో పాటు ఇతర నిత్యావసరాలను అందించడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని నేను ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధ‌న‌మ్ గేబ్రియాసిస్ తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నారు. 20 కోట్ల మందికి డబ్బు బదిలీ చేస్తున్నారు. 8 కోట్ల మందికి ఉచితంగా మూడు నెలలకు సరిపడా వంట గ్యాస్‌ సరఫరా చేస్తున్నారు’ అని ట్వీట్లు చేశారు.

Related posts