telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

corona vairus

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు తగ్గుతున్నాయి. ఇది శుభపరిణామమే అని చెప్పాలి. ఇక తాజా కేసులతో దేశంలో 2.80 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 2,795 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,55,287 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044 కాగా..ఇందులో 2,59,47,629 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 18,95,520 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,31,895 నమోదైంది.

Related posts