telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వివేకా హత్య కేసు : ఎన్నికలు అయ్యేవరకు .. నో ప్రెస్ మీట్ .. సిట్

hicourt orders to sit on viveka murdur case

వివేకా హత్య కేసు పై సిబిఐ విచారణ జరిపించాలని ఉద్దేశ్యంతో హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై నేడు విచారణ జరిపిన కోర్టు, పిటిషన్ దారు అభిప్రాయాలతో ఏకీభవించింది. దీనితో సిట్ ఎన్నికలు ముగిసేవరకు ఎటువంటి ప్రెస్ మీట్ ఇవ్వరాదని ఆదేశించింది. అలాగే సిబిఐ తో లేదా థర్డ్ పార్టీ తో విచారణపై కోర్టు తదుపరి విచారణలో తేల్చనుండి.

వివేకా హత్య తన ఇంటిలోనే జరిగిన విషయం తెలిసిందే. దీనితో ఈ హత్యపై గవర్నర్ కు పిర్యాదు చేయడం, హుటాహుటిన సిట్ ను ఏర్పాటు చేయడం జరిగిపోయింది. అయితే ఇది కుటుంబ హత్యనూ .. రాజకీయ హత్యగాను.. ఆస్తి తగాదాలతో జరిగిన హత్యగానూ ఇప్పటివరకు వార్తలలో వినపడింది. తాజాగా ఈ హత్య బీహార్ నుండి వచ్చిన వాళ్ళు చేశారనే వార్త కూడా తెరపైకి వచ్చింది. ఇలా కేసును పలువిధాలుగా మలుపులు తిప్పుతూ, తప్పుదోవ పట్టిస్తూ, రాజకీయం చేస్తుండటతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. వివేకా సతీమణి కూడా సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది.

Related posts