telugu navyamedia
telugu cinema news trending

శ్రీముఖి రీఎంట్రీ… ఫుల్ ఫన్ గ్యారంటీ… వీడియో వైరల్

Srimukhi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి మళ్లీ బుల్లితెర ముందుకు రాబోతోంది. స్టార్ మ్యూజిక్‌లో శ్రీముఖి కొత్త అవతారం ఎత్తబోతోంది. సెలబ్రేషన్స్ విత్ సెలబ్రిటీ పేరుతో ఓ కొత్త మ్యూజికల్ షోకు శ్రీముఖి హోస్ట్ చేయబోతంది. ఇందులో అంతా మ్యూజిక్ మేజిక్ చేస్తానని చెబుతోంది శ్రీముఖి. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా స్టార్ మ్యూజిక్ రిలీజ్ చేసింది. స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ పేరుతో ఉన్న ఈ వీడియోలో శ్రీముఖి డ్యాన్స్‌లు, పాటలతో దుమ్మురేపుతోంది.సెలబ్రిటీల గేమ్‌ షోలకు బుల్లితెర వీక్షకుల నుంచి బాగా ఫాలోయింగ్ ఉంది. అయితే, కేవలం టాక్ షో మాత్రమే కాకుండా… వారితో పాటలు పాడించడం, ఆటలు ఆడించడం.. నవ్వించడం.. కవ్వించడం వంటి కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయబోతోంది శ్రీముఖి. ఫుల్ ఫన్ గ్యారెంటీ అంటున్న శ్రీముఖి.. ఈ షోను అస్సలు మిస్ అవ్వొద్దని.. అవసరమైతే అలాంటి పెట్టుకొని మరీ చూడాలని పిలుపునిస్తోంది. అయితే, ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతోందనేది ఇంకా ఖరారు కాలేదు.

Related posts

అమెజాన్ పొరపాటు.. 9 లక్షల వస్తువు.. 6వేళకే సొంతం..

vimala p

పియాజియో .. సరికొత్త వెస్పా అర్బన్‌ క్లబ్‌ .. 125సీసీ ఇంజిన్‌..

vimala p

ఆ హీరోతో డేటింగ్ లో వున్నా… ప్రముఖ క్రీడాకారిణి వ్యాఖ్యలు

vimala p