telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్కూల్ బస్సులో సీసీటీవీ కెమెరా… 12 ఏళ్ళ బాలుడిపై…

School-Bus

ఆసియాకు చెందిన స్కూల్ బస్ డ్రైవర్ గత మేలో 12 ఏళ్ల అబ్బాయిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్కూల్ అయిపోయిన తరువాత డ్రైవర్ స్కూల్ బస్సును బాధిత బాలుడి ఇంటి సమీపంలో ఉన్న అల్ బర్షా ప్రాంతంలో పార్క్ చేశాడు. అబ్బాయి ఒక్కడే ఉండడం గమనించిన డ్రైవర్ వాహనాన్ని శుభ్రం చేయాడానికి తనకు సహకరించాలని కోరాడు. బాలుడు తాను మాట్లాడుతుండగానే డ్రైవర్ బస్సులోని సీసీటీవీ కెమెరాను కవర్ చేయడం బాలుడు గమనించాడు. కెమెరాను ఎందుకు కవర్ చేస్తున్నావని డ్రైవర్‌ను అడిగినా… అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అనంతరం బాలుడిని దగ్గరకు తీసుకొని అతడి దుస్తులు విప్పేందుకు యత్నించాడు డ్రైవర్. దాంతో బాలుడు డ్రైవర్‌ను కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయి క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నిందితుడు తన నేరాన్నిఅంగీకరించగా తుది తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.

Related posts