telugu navyamedia
రాజకీయ

దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ సంచలనం …

“తమిళనాడు రాష్ట్రం లో ముఖ్యమంత్రి ఎమ్ .కె .స్టాలిన్ పాలనపై ఇప్పుడు దేశమంతా చర్చించు కుంటున్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు , అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సమానమేనని అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలననే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి స్టాలిన్ ” అని దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు .

Shocked by President Gotabaya Rajapaksa's view on political powers for Lankan Tamils: DMK chief MK Stalin | India News

సోమవారం నాడు నవ్యమీడియా ప్రతినిధి తో మాట్లాడుతూ , ” నేను ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించాను . హైదరాబాద్ లో చదువుకున్నాను . సినిమా నిర్మాణం కోసం 1985 నుంచి చెన్నై లో ఉంటున్నాను . అయితే ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు . ప్రతి పక్షాన్ని కక్ష్య తో సాధించకుండా , పాలనలో వారి సహకారాన్ని కూడా తీసుకోవడం , ప్రభుత్వ కమిటీల్లో వారిని కూడా భాగస్వాములను చెయ్యడం , గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీమతి జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చెయ్యకుండా కొనసాగించడం ఎంతో హర్షించతగ్గ పరిణామం “అని చెప్పారు . అంతే కాదు సచివాలయంలో కరుణానిధి ఫొటోతో పాటు జయలలిత ఫోటో కూడా ఉంచాలని స్టాలిన్ అధికారులకు చెప్పడం మంచి పరిణామం ” అని ప్రసాద్ తెలిపారు.

“కోవిడ్ సేవలో వున్న డాక్టర్లు , నర్సు లకు జీతం కాకుండా ప్రత్యేక నగదును అందించడం , కోవిడ్ తో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఆర్ధిక సహాయం . కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆర్ధిక సహాయం అందించడం , నగరంలో తిరిగే ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిచడానికి అనుమతించడం , స్టాలిన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ” అని చెప్పారు .
“చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించడం , శాసన సభ్యులు , పార్లమెంట్ సభ్యులు, ,మంత్రులు ఎవరైనా , ఏ సందర్భంలో కూడా రాష్ట్రంలో ఫ్లెక్సీ లను ఏర్పాటు చెయ్యకూడదని , అలా చేస్తే కేసులు నమోదవు చేస్తామని హెచ్చరించాడు . ఇది కూడా చాలా మంచి నిర్ణయం ” అని చెప్పారు .

” పక్క రాష్ట్రాల పాలన కూడా చూస్తున్నాము . అధికారంలోకి రాగానే , ఐఏఎస్ .ఐపీఎస్ అధికారులను ఏవిధంగా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారో అందరికీ తెలుసు . ప్రభుత్వంలో వున్న పెద్దలకు అనుకూలంగా వ్యవహరించే అధికారులు కోర్టు మెట్లెక్కుతున్నారు . అయితే తమిళనాడులో మాత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు . పాలనలో ఎలాంటి జ్యోక్యం ఉండదని హామీ ఇచ్చాడు ” అని ప్రసాద్ చెప్పారు .

“అధికారంలోకి వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా భజన బృందాలను ప్రోత్సహిస్తాడు .అయితే స్టాలిన్ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం . అనవసరంగా , అసందర్భంగా పొగడకూడదని , ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లాలని , మంత్రులు , శాసన , సభ్యులు , అధికారులు , పార్టీ నాయకులకు హెచ్చరిక జారీ చేశాడు . ఒక మంచి ముఖ్యమంత్రి కి వుండాల్చిన లక్షణమిది ” అన్నారు ప్రసాద్ .

Tamil Nadu: IT raids at DMK chief Stalin's son-in-law's premises in Chennai  ahead of polls

” ఏ ప్రభుత్వమైనా కళలను ప్రోత్సహిస్తుంది , కళాకారులను గౌరవిస్తుంది . అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సినిమా రంగాన్ని చిన్న చూపు చూస్తున్నాయి . గత ఆరు సంవత్సరాల నుంచి సినిమాలకు అవార్డులు ఇవ్వడం లేదు . సినిమా రంగ సమస్యలను పరిష్కరించడం లేదు . మేము దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి తరుపున ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలినప్పుడు , సినిమాకు అన్ని రకాలుగా చేయూత నిస్తామని , తమ తండ్రి కరుణానిధి కి సినిమా రంగంతో విడతీయరాని అనుబంధం ఉందని, తమ కుమారుడు ఉదయనిధి కూడా హీరోగా వున్నాడని చెబుతూ , సినిమా అవార్డులు గత ఐదు సంవత్సరాలనుంచి ఇవ్వడం లేదు , అయితే మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల అవార్డులను ప్రదానం చేస్తుందని హామీ ఇచ్చారు . స్టాలిన్ పాలన చూసి మిగతా రాష్ట్రాలవారు నేర్చుకోవాలి “అని ప్రసాద్ చెప్పారు . “దేశంలోనే రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ని చూసి మేము ఎంతో గర్విస్తున్నామని కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు .
– భగీరథ

Related posts