telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జేడీయూ నేతకు మళ్ళీ షాక్ తగలనుందా…?

బీహార్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుతో పోటీ చేశారు.. జేడీయూకి సీట్లు తగ్గినా.. నితీష్‌కుమార్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌తో మరోసారి ఆయనను సీఎంను చేసింది బీజేపీ.. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇప్పుడు నితీష్‌కుమార్‌కు బిగ్‌ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది… ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు… జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా తమ పార్టీలో చేరేందుకు రెడీ ఉన్నారంటూ పొలిటికల్ హీట్ పెంచిన ఆయన.. అయితే, తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోమన్నారు.. 28 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే మాత్రం పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు.  ఇప్పుడు శ్యామ్ రజాక్ బీహార్‌ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి… 17 మంది జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. ఆర్జేడీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ క్షణమైనా జరగొచ్చు అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.. అంతే కాదు.. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు తాము అతిక్రమించడం లేదు.. కాబట్టి.. 28 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చిన ఆయన.. త్వరలోనే 28 ఎమ్మెల్యేలు కూడా జేడీయూలో చేరే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పి కాకరేపారు. అయితే, జేడీయూ నేత రజాక్ వ్యాఖ్యలను నితీష్ కుమార్ కొట్టి పారేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని, తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts