telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి” ట్రైలర్

buchi

మున్నా, దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి’. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పమిడిముక్కల చంద్రకుమారి నిర్మించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రవి వర్మ, ‘కంచరపాలెం’ రాజు, ప్రభావతి, పవిత్ర ముఖ్య పాత్రలు పోషించారు. 1994 నుంచి 2004 మధ్య జరిగిన కథగా సినిమాలో చూపించారు. పరువు నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. అలాగే, ఎమోషన్స్‌కు కూడా పెద్ద పీట వేశారు. ఈ చిత్రం అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ఈనెల 21న విడుదలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం హీరోయిన్ సమంత అక్కినేని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని ఆమె కొనియాడారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది. కానీ, నా కథ నా సావుతో మొదలైంది’’ అనే పవర్ ఫుల్ డైలాగుతో ట్రైలర్‌ను స్టార్ట్ చేశారు. ట్రైలర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts