telugu navyamedia
సినిమా వార్తలు

“రాక్షసుడు”గా మారుతున్న బెల్లంకొండ శ్రీనివాస్

BEllamkonda-Srinivas
రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించబోతున్నాడు. క్రితం ఏడాది తమిళంలో భారీ హిట్ కొట్టిన “రాచ్చసన్” సినిమాకి  రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్కడ అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కబోయే ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రీమేక్ కు తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి “రాక్షసుడు” అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో సూర్య అనువాదం చిత్రం కూడా “రాక్షసుడు” అనే టైటిల్ తో తెలుగులో విడుదలైంది. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ రాబోతున్నాడని సమాచారం. దాదాపు ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని చెబుతున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన “సీత”  చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Related posts