telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

‘ఉచిత వ్యాక్సిన్‌’ వాగ్దానం చట్టబద్ధమే : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

బీహార్ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పూర్తిగా చట్టబద్ధమైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పాట్నాలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రగతి శీలంగా ఆలోచిస్తూ..రాష్ట్రానికి తన మేనిఫెస్టోలో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తే ఏ ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. కొందరు దీన్ని రాజకీయ కుట్రగా పేర్కొనడం దారుణమని..ప్రజల ఆరోగ్య సంరక్షణకు వాగ్దానాలు చేయరా ? అని ప్రశ్నించారు. ఉచిత వ్యాక్సిన్‌ ప్రకటన పూర్తిగా చట్టబద్దమైనది, ఎన్నికలకు ముందు వాదనలు చేసే వ్యక్తులకు మాత్రమే ఇది సమస్యాత్మకమన్నారు. కాగా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను నిన్న విడుదల చేశారు. బీహార్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని..వారికి రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువనే అని పేర్కొన్నారు. పార్టీలు చేసే వాగ్ధానాలను వారు అర్ధం చేసుకుంటారని ఆమె అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత..బీహార్ లో ప్రతి పౌరుడికి ఉచితంగా ఆ టీకా ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేం చేసిన తొలి వాగ్దానం ఇదే అని మంత్రి అన్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Related posts